Friday, June 20, 2008

ప్రేమా? పైశాచికమా?

స్రుష్టికి మూలం ప్రేమ.ప్రేమ అనేది ఈ స్రుష్టిలో చాలా అమూల్యమైన వరం. ప్రతి ఇద్దరు మనుషుల మధ్య ఉండేదే ఈ ప్రేమ. కానీ రాను రాను సమాజంలో ప్రేమ అనే పదానికి అర్థాలు మారిపోతున్నాయి. ప్రేమ అనేది ఎన్నో రకాలు.అది ఎవరి మధ్యనైన ఉండవచ్చు. తల్లితండ్రులకు పిల్లల మీద ఉండేది ప్రేమ కాదా? అలాగే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేది కూడా ప్రేమే. కానీ ప్రేమ అనేది ఒక మనిషి మీద మనకు ఏర్పడే ఒక సున్నితమైన భావం.అది దానెంట అదే కలగాలి కనీ ఒకరు రుద్ధినంత మాత్రాన రాదు.ఈ మధ్యకాలంలో మనం తరచు న్యూసులో చూస్తున్నాము ప్రేమించలేదని ఒకరినిఒకరు చంపుకుంటున్నారు ఎవరిచ్చారు వారికి ఆ అధికారం?ప్రేమించిన మనిషి దక్కకపొతే చంపడమా ప్రేమంటే? తను నిన్ను ప్రేమించిన ప్రేమించకపొయిన తన సుఖము కోరేవరే నిజమైన ప్రేమికులు. ఈ ప్రేమనేది ఇప్పుడు కొత్తగ వచ్చిందా? స్రుష్టి మొదలైనాటి నుండి ఉందీ ప్రేమ. ప్రేమించిన మనిషిని చంపి నీవు పొందే దేమి? నీకు చెడ్డ పేరు. నీ తల్లితండ్రులకు క్షోభ. నీకు జైల్ శిక్ష తప్ప. ఈ మధ్య ఈ దారునాల వల్ల ఈ మధ్యే అథికమైన స్త్రీ విద్య మళ్ళి మరుగున పడే అవకాశముంది. తల్లితండ్రులు ఆడపిల్లలను ఉన్నత విద్యలకు పంపడానికి భయపడుతున్నరు.సమాజం ఇటువంటి దారుణాలను సహించకుడదు. ఇటువంటి చర్యలకు పాలుపడిన వారికి కఠిన శిక్షలు విథించాలి. ప్రేమించలెదని ప్రథిఒక్కరు వారిని చంపుకుంటుపోతే మిగిలేదేమి? ప్రేమంటే భయం తప్ప.

ప్రేమించడం తప్పు అని నెను అనడం లెదు. ప్రేమని వ్యక్తపరచు ఒప్పుకుంటె పెళ్ళి చేసుకొని హాయిగా ఉండు. లేఖపోతే మరచిపొయి నీ జీవితాన్ని సరిద్దిదుకో మిత్రమా!

No comments: