Wednesday, May 14, 2008

మంచి మాటలు

1.సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు.
2.తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.
3.మన సంతోషం మన తెలివితేట పై అధారపడి వుంతుంది.
4.కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంతుంది.
5.థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.
6.బాథ్యతానిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.
7.మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది.
8.మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.
9.అఙ్ననం భిన్నత్వానికి,ఙానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.
10.వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.
11.నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది.గర్వం శత్రువుల్ని పెంచుతుంది.
12.సత్యమార్గంలో నడిచేవాడేసంపన్నుడు.
13.ఆనందాన్ని మించిన అందాన్నిచ్హే సౌందర్యసాధనం మరొకటి లేదు.
14.దుహ్ఖం అనేది శిక్ష కదు.సంతొషం అనేది వరమూ కదు. రెండూ ఫలితాలే .
15.స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.
16.నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, ఙానం,వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.
17.సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్క్ర్రుతి.
18.మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.
19.థైర్యం,కాలం,ప్రక్రుతి,....ఈ మూడూ ఉతమమైన గొప్ప వైద్యులు .
20.పరిస్థితులు కాదు మానవుణ్ణి స్రుష్టించింది. మానవుడే పరిస్థితుల్ని స్రుష్టించుకున్నాడు

No comments: